గాలే టెస్టులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా, కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టులోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో తుది జట్టులో ఒక ఆసక్తికర మార్పు చేసేందుకు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కుల్దీప్ ప్లేసులో అతడు తుది జట్టులో రానున్నట్లు సమాచారం.


