డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చారిత్రక ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా జట్టు తక్షణ చర్యలకు ఉపక్రమించింది. దారుణంగా విఫలమైన ఓపెనర్ జేక్ వెదరాల్డ్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. మెకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనున్న రెండో టెస్టు కోసం 30 ఏళ్ల బ్యాటర్ మ్యాట్ రెన్షాను ఆసీస్ స్క్వాడ్‌లోకి రీకాల్ చేశారు. రెన్షా ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


