గురుగ్రామ్‌లోని అత్యంత విలాసవంతమైన ‘ట్రంప్ టవర్స్’ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో డెవలపర్ ఎమ్3ఎమ్ (M3M) తనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు 36వ అంతస్తు నివాసి వరుణ్ సుహాగ్ ఆరోపించారు. ఫ్లాట్‌కు వెళ్లే లిఫ్ట్ సౌకర్యాన్ని నిలిపివేయడంతో పాటు డెలివరీ ఏజెంట్లు, అతిథులు, వ్యక్తిగత వాహనాల రాకపోకలను అడ్డుకున్నారని ఆయన వాపోయారు. 2024లో ఫ్లాట్ అప్పగిస్తామని ఇవ్వకపోవడంతో తాను కేసు పెట్టానని.. ఆ కోపం వల్లే ఇలా చేశారంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ విషయం వైరల్ కావడంతో చివరకు బిల్డర్ లిఫ్ట్ సేవలను పునరుద్ధరించారు.


