ఉత్తరాఖండ్లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో ఛార్ధామ్ యాత్ర మార్గంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘కో-పైలట్’ నిబంధన తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రతి ఛార్టర్ సార్టీకి ఇద్దరు పైలట్లు ఉండాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ హెలికాప్టర్ ఆపరేటర్లు సేవలను నిలిపి వేస్తామని హెచ్చరించారు. అయితే ఈరోజు నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆపరేటర్లు, యజమానులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీస్కోవాలని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా నిర్ణయం తీస్కుంటేనే సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు.


