ఇంటికి వచ్చే అతిథులను ముందుగా ఆకట్టుకునేది లివింగ్ రూమ్‌నే. అందుకే పండుగల సమయంలో ఈ గది అందంగా కనిపించాలని చాలామంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీపావళి సందర్భంగా లివింగ్ రూమ్‌ను కొత్తగా తీర్చిదిద్దాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో మూలన ఉన్న పాత దీపాలు, పూల కుండీలు, కుషన్లు, అలంకరణ వస్తువులకే కొత్త రూపం ఇవ్వొచ్చు. మరి కొత్త వస్తువులు కొనకుండానే లివింగ్ రూమ్‌ను అందంగా మార్చే ఐడియాలేంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.


