వంటగదిలో అడుగుపెట్టి చకచకా గారేలో, పోపులో వేస్తుంటాం.. కానీ ఒక్క చిన్న అశ్రద్ధతో వేడి నూనె చిట్లి చేతిమీద పడితే అబ్బా.. ఆ నిమిషంలో వచ్చే మంట, ఆ తర్వాత చర్మంపై ఎక్కే బొబ్బలు పడే వేదన వర్ణనాతీతం. అలా వేడి నూనె పడిన వెంటనే విపరీతమైన మంట రావడం, బొబ్బలు ఎక్కడం, నల్లటి మచ్చలు పడతాయి. ఈ టెన్షన్ సమయంలో చాలామంది ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి ఎమర్జెన్సీ టైమ్‌లో చాలామంది కంగారుపడి కనపడిన టూత్ పేస్టో, మైదా పిండో రాసేస్తుంటారు.
కానీ అది గాయాన్ని నయం చేయకపోగా పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. మరి వంట చేసేటప్పుడు అనుకోకుండా వేడి నూనె పడితే వెంటనే ఏం చేయాలి, మంట చిటికెలో తగ్గి, మచ్చలు పడకుండా ఏం చేయాలి, నూనె పడిన వెంటనే ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలి వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


