రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపల పులుసుకు భలే డిమాండ్ ఉంటుంది. అసలు ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేపల పులుసు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆంధ్రా స్టైల్ చేపల పులుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఘాటైన మసాలాలు, చింతపండు పులుపు, కారం కలగలిసిన అద్భుతమైన రుచి. అయితే, ఈ పులుసును ప్రత్యేకంగా మార్చే పదార్థాల్లో బెండకాయ ఒకటి.
సాధారణంగా కూరల్లో జిగురుగా ఉంటుందని భావిస్తారు. అయితే, చేపల పులుసు వండేటప్పుడు మాత్రం బెండకాయను వేస్తారు. తరతరాలుగా మన పెద్దలు చేపల పులుసు వండేటప్పుడు కొన్ని బెండకాయ ముక్కలను తప్పనిసరిగా వేయడానికి కేవలం అలవాటు మాత్రమే కాదు, దాని వెనుక బలమైన పాకశాస్త్ర కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.


