న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ (49 బంతుల్లో 107) శతకంతో చెలరేగగా, మైకెల్ బ్రెస్‌వెల్ (25 బంతుల్లో 65) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన భువనేశ్వర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు.


