ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా గ్రేటర్ నోయిడాలోని మహాగున్ మైవుడ్స్ సొసైటీలో తీవ్ర ఘోరం జరిగింది. ప్రతీరోజూ ఉదయం నిర్వహించే పూజ కోసం పూలు తీసుకొచ్చేందుకు వెళ్లారు తండ్రీ కొడుకులు. ముఖ్యంగా 11 ఏళ్ల కుమారుడు బాల్కనీలో పూలు తెంపుతుండగా.. కాలుజారి కిందపడ్డాడు. గాలిలో వేలాడం చూసి వెంటనే 40 ఏళ్ల తండ్రి అతడిని కాపాడబోయాడు. ఈక్రమంలోనే చేయి అందించబోయి పట్టుతప్పి అతడు కూడా కిందపడిపోయాడు. ఇలా ఇద్దరూ 23వ అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు.


