ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే కోచ్‌ను మార్చిన ఆ జట్టు.. తాజాగా మిగతా కోచింగ్ స్టాఫ్‌ను సైతం మార్చేసింది. బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పరాస్ మాంబ్రేలతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్లకు ముంబై సాగనంపింది. మహేల జయవర్ధనే స్థానంలో కీరన్ పొలార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమించగా, భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


