హైదరాబాద్లో రైస్ డిపోలపై పలు శాఖల అధికారులు సంయుక్తంగా చేసిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి.. వాటిని పాలిష్ చేసి.. సన్న బియ్యం పేరుతో జనాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బియ్యం బ్యాగుపై బరువును 26 కిలోలుగా ముద్రించి.. 24, 25 కిలోల మధ్య మాత్రమే బియ్యం ఉన్నట్లు తేలింది. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి బ్రాండెడ్ పేర్లతో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు నమూనాలు సేకరించారు. కొన్ని డిపోల్లో ట్రేడ్ లైసెన్సుల ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.


