నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, తన రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగేళ్లు జట్టుకు దూరంగా ఉండటం తనకు పెద్దగా కష్టంగా అనిపించలేదని, టీమిండియాలో స్థానం కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదని స్పష్టం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో తన స్థానంపై జరుగుతున్న చర్చలను పక్కనబెట్టి, ప్రస్తుతం ఆటను ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టానని కివీస్‌తో మూడో టీ20 తర్వాత తెలిపాడు.


