మెగా కోడలు ఉపాసన కొణిదెల ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని తన తాత ప్రతాప రెడ్డితో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి.. అక్కడ రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేశారు. అక్కడ గోశాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాసనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. గర్భగుడిలోకి వెళ్లి వాయులింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, జ్ఞానప్రసూనాంబ దేవికి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో మెగా కోడలు ఉపాసన.. రాహు- కేతు సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు
RELATED ARTICLES


