తమిళనాడులోని ఆగమ సంప్రదాయ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది. మూలవిరాట్టుపై పూర్తి విశ్వాసం కలిగి ఉండి, ఆలయ పవిత్రతను పాటిస్తామని డిక్లరేషన్ పత్రంపై సంతకం చేస్తేనే అన్యమతస్థులను అనుమతించాలని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకునే క్రమంలో ఈ సంప్రదాయాన్ని పాటించడాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా సీఎం డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం గొప్ప విషయమని పేర్కొంది.


