వంటగదిని క్లీన్‌గా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వంటగదిలో సింక్ ఉంటుంది. అయితే, కిచెన్‌లో గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నా లేదా పైపు నుంచి దుర్వాసన వస్తున్నా రోజువారీ పనులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమయంలో చాలా మంది వెంటనే మార్కెట్లో దొరికే ఘాటైన కెమికల్ డ్రెయిన్ క్లీనర్లను వాడుతుంటారు.
ఇక, చాలా మంది బేకింగ్ సోడా, వెనిగర్ వేసి ప్రయత్నిస్తుంటారు. అయితే, ప్రతి రకమైన బ్లాకేజీకి ఈ చిట్కాలు పనిచేయవు. సింక్ పైపుల్లో నూనె, జిడ్డు, ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే నీటి ప్రవాహం ఆగిపోతుంది. సరైన పద్ధతుల్ని ఎంచుకోవడం ద్వారా పైపులకు నష్టం జరగకుండా సింపుల్‌గా బ్లాకేజ్ తొలగించవచ్చు. అసలు కిచెన్ సింక్ ఎందుకు జామ్ అవుతుంది? ఇంట్లో ఫాలో అవ్వాల్సిన పద్ధతులేంటో తెలుసుకుందాం.


