నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఒకప్పటిలా కరెంట్ లేకుంటే చీకట్లోనే ఉండాలి అనే రోజులు పోయాయి. ఇన్వర్టర్ వచ్చేసింది. ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఫ్యాన్, లైట్లు ఆగిపోకుండా ఉండాలంటే ఇన్వర్టర్ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది ఇళ్లలో దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇన్వర్టర్ను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన ప్రదేశంలో పెట్టకపోవడం, బ్యాటరీని సరిగ్గా మెయింటేన్ చేయకపోవడం, సామర్థ్యానికి మించి పరికరాలను కనెక్ట్ చేస్తే సమస్యలు రావచ్చు. మరి ఇంట్లో ఇన్వర్టర్ను సురక్షితంగా ఉపయోగించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.


