ఫ్రీ బస్సు వల్ల తనకు కలిగిన అసౌకర్యాన్ని ఓ వ్యక్తి.. నేరుగా ఎమ్మెల్యే ముందు చెప్పుకుని తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల తన భార్య తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయిందని పేర్కొన్నారు. 5 రోజులు వెతికినా దొరకలేదని ఆ వ్యక్తి వాపోయాడు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేను కలిసి ఫ్రీ బస్సు పథకాన్ని తీసేయాలని వేడుకున్నాడు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.


