తెలంగాణలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చుట్టూ రాజకీయ చర్చ మళ్లీ వేడెక్కింది. ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలు జరుపుతూ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. 148 మీటర్లకు బదులుగా 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు భూములు, రైతులకు పరిహారం, పర్యావరణ అనుమతులు వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి.


