Rs 1000 Bank Note Viral: ప్రస్తుతం చలామణిలో ఉన్న పెద్ద నోటు అంటే రూ.500 మాత్రమే. అయితే కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.1000 నోటు తీసుకొస్తోందని చెబుతూ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రూ.1000 సంఖ్యతో ముద్రితమైన ఆ ఫోటోలు చూసి నిజంగానే మళ్లీ రూ.1000 నోట్లు వస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, కొత్తగా రూ.1000 నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


