సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆయన తక్షణమే ఆ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీకి తొత్తుగా మారిపోయిన ఈసీ.. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతుందని దుయ్యబడుతున్నాయి. అక్టోబరు 2 నుంచి ప్రతిపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో పలు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నవంబరు 1న భారీ ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని, పండుగ సీజన్లో చాలా నష్టపోతామని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వాయిదా వేసుకోవాలని లేఖ రాశారు.


