SIR వివాదం వేళ సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు ఉత్తర్వులు సహా సంబంధిత నిర్ణయాలన్నీ ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు పేర్కొంది. ఫైళ్ల పరిశీలన సమయంలో కమిషనర్లు వ్యక్తం చేసే అభిప్రాయాలు, ప్రశ్నలు తుది నిర్ణయాలుగా పరిగణించరాదని వివరించింది. ఇక కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో ఎస్ఐఆర్ వల్ల ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నిర్ణయాలపై సమాచారం ఇవ్వలేదంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.


