DMart Founder Stocks: భారతదేశంలో రిటైల్ కింగ్ డీమార్ట్ ఓనర్ రాధాకిషన్ దమానీ ఇతర చాలా కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈయన దేశీయంగా అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఒకరిగా ఉన్నారు. డీమార్ట్ మినహాయిస్తే ఆయన స్టాక్ హోల్డింగ్స్ వాల్యూ రూ. 9956 కోట్లుగా ఉంది. దీంట్లో NSE వాటానే రూ. 6521 కోట్లకుపైగా ఉంది. ఇంకా సుందరం ఫైనాన్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్, 3M ఇండియా వంటి కంపెనీల్లో కూడా ఆయనకు వాటాలు ఉన్నాయి.


