HomeEntertainmentస్టార్ హీరోలనే దాటేసిన నయనతార క్రేజ్... థియేటర్ వద్ద 60 అడుగుల కటౌట్‌తో పూనకాలు

స్టార్ హీరోలనే దాటేసిన నయనతార క్రేజ్… థియేటర్ వద్ద 60 అడుగుల కటౌట్‌తో పూనకాలు

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ డివోషనల్ చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహా శక్తి’) ప్రమోషన్లలో భాగంగా ఒక అరుదైన రికార్డు నమోదైంది. తమిళనాడులోని వేల్స్ థియేటర్స్ వద్ద నయనతారకు ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తమిళ సినీ చరిత్రలోనే ఒక కథానాయికకు ఇంతటి భారీ కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. సుందర్ సి దర్శకత్వంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments