HomeEntertainmentరజనీ మాస్.. బాలయ్య పవర్.. విజయ్ సేతుపతి విలనిజం.. 'జైలర్ 3' క్రేజీ కాంబో సెట్టయినట్లేనా?

రజనీ మాస్.. బాలయ్య పవర్.. విజయ్ సేతుపతి విలనిజం.. ‘జైలర్ 3’ క్రేజీ కాంబో సెట్టయినట్లేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే రూ. 600 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కాగా, ఈ మూవీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ‘జైలర్ 3’పై ఇచ్చిన లీడ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో ‘జైలర్ 2’లో అతిథి పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను సంప్రదించగా, తగినంత నిడివి లేకపోవడంతో ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. అయితే, మూడో భాగంలో తన ఇమేజ్‌కు తగ్గ బలమైన పాత్ర ఇస్తే నటించేందుకు బాలయ్య సానుకూలత వ్యక్తం చేశారనే వార్త వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments