HomeLifestyleకన్ను అదిరితే శకునం కాదు.. నరాల సమస్య కావొచ్చు! ఎప్పుడు డాక్టర్‌ని కలవాలంటే

కన్ను అదిరితే శకునం కాదు.. నరాల సమస్య కావొచ్చు! ఎప్పుడు డాక్టర్‌ని కలవాలంటే

సాధారణంగా మన దేశంలో కన్ను అదరడాన్ని శకునాలతో ముడిపెట్టి చూస్తారు. అయితే, కన్ను అదరడం వెనక వైద్యపరమైన కారణాలు ఉండొచ్చు. అయితే, చర్మం కింద ఉండే కండరాలు మన ప్రమేయం లేకుండానే చిన్నగా అలల మాదిరిగా కదలడం లేదా కొట్టుకోవడాన్ని వైద్య పరిభాషలో మయోకీమియా అంటారు. ఇది సాధారణంగా కంటి రెప్పలపై ప్రత్యేకించి ఏదో ఒక కంటి కింది రెప్పపై ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు రోజులు లేదా వారాల తరబడి రావచ్చు. ముఖంలోని ఇతర కండరాలు, చేతులు, కాళ్లలో కూడా ఇది కనిపించవచ్చు. చాలా అరుదైన సందర్భాల్లో శరీరంలోని ఇతర కండరాల సమూహాల్లో కూడా రావచ్చు.

​ఇది సాధారణంగా ఒత్తిడి, అలసట, అధిక కెఫీన్ వల్ల వస్తుంది. అయితే చాలా రోజుల పాటు ఆగకుండా వస్తున్నా, ఇతర భాగాలకు వ్యాపిస్తున్నా నరాల సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. అసలు కన్ను తరచూ ఎందకు అదురుతోంది, సాధారణ కారణాలు ఏంటి, ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి అన్న పూర్తి వివరాలు డాక్టర్ భాను ప్రకాష్ ఎం (సీనియర్ కన్సల్టెంట్ – క్యాటరాక్ట్, కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments