హౌతీలు, సౌదీ అరేబియా మధ్య తలెత్తిన ఘర్షణ మళ్లీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఎప్స్టీన్ పత్రాలు కీలకంగా మారాయి. ఇప్పుడు వీటినే హౌతీలు తమ ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారు. సౌదీ రాజవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కాబా వస్త్రాలను ఎప్స్టీన్కు పంపినట్లు వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. సౌదీ నాయకత్వం ఇస్లాం పవిత్ర స్థలాల రక్షణపై చేస్తున్న వాదనలను హౌతీలు ప్రశ్నిస్తున్నాయి. మక్కాపై డ్రోన్ దాడి ఆరోపణలను హౌతీలు ఖండించాయి. ప్రసంగాలు, వీడియోలు, పాటలు, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారాన్ని విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.
సౌదీ అరేబియాపై హౌతీల కొత్త ప్రచార అస్త్రం.. ఎప్స్టీన్ ఫైల్స్‌తో మక్కా అంశాన్ని తెరపైకి!
RELATED ARTICLES


