HomeNation and Worldపాకిస్థాన్‌తో 20 రక్షణ ఒప్పందాలు చేస్కున్న మాల్దీవ్స్.. సార్క్ పునరుద్ధరణకు మయిజ్జు పిలుపు

పాకిస్థాన్‌తో 20 రక్షణ ఒప్పందాలు చేస్కున్న మాల్దీవ్స్.. సార్క్ పునరుద్ధరణకు మయిజ్జు పిలుపు

మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఇటీవల పాకిస్థాన్‌లో మూడు రోజుల పాటు పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంంగా ఆ పర్యటనలో ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్లతో పాటు అత్యంత శక్తివంతమైన ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునిర్‌లతో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు. అయితే ఇరు దేశాల మధ్య దౌత్య బంధం ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. రక్షణ సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం, విమానయాన రంగాల్లో బంధాన్ని మరింత విస్తరించుకోవడానికి ఏకంగా 20 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అంతేకాకుండా ‘సార్క్’ కూటమిని వెంటనే పునరుద్ధరించాలని ముయిజ్జు పిలుపునిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments