కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ రాజకీయ పయనంపై ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. రాహుల్ గాంధీ ‘మొహబ్బత్ కీ దుకాణ్’ (ప్రేమ దుకాణం) నినాదంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు ప్రేమకు బదులుగా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని, అందుకే ఆయన మాక్ పార్లమెంట్ ద్వారా ఒక కొత్త దారిని ఎంచుకున్నారన్నారు. దేశానికి పీఎం కావాలనే మీ కల మాత్రం ఎప్పటికీ నెరవేరదని అమిత్ షా ఎద్దేవ చేశారు.
మీరు అక్కడే ప్రధాని అవ్వండి… దేశానికి ఎప్పటికీ కాలేరు: రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్స్
RELATED ARTICLES


