అనంతపురం జిల్లాలోని రాప్తాడు జడ్పీ హైస్కూల్లో విద్యార్థినులపై జరిగిన దాడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటన రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు, జంగిల్‌రాజ్‌కు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. విద్యాసంస్థల్లో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలని ఆయన కోరారు. ఈ దారుణ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
‘రెడ్ బుక్’ పాలనకే ప్రాధాన్యమా..? చట్టమంటే భయం లేకుండా పోయింది… రాప్తాడు ఘటనపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు
RELATED ARTICLES


