మాజీ సీఎం, పులివెందులలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛ ఉందని డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. అయిటే ఓటు వేసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తన ఇంటి వెళ్లాలని అన్నారు. పులివెందులలో తిరగడానికి అనమతి లేదని చెప్పుకొచ్చారు. కాగా నగరంలోని ఎన్నికల సామగ్రి పంపిణీని ఆయన పరిశీలించారు. అలాగే ఎన్నికల సమయంలో ఎవరైనా పులివెందులలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఐజీ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు, కానీ పులివెందులలో తిరిగేందుకు నో పర్మిషన్ : DIG కోయ ప్రవీణ్
RELATED ARTICLES


