Nara Lokesh On Raptadu School Incident: అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై దాడి కలకలం రేపింది. బాలికపై ఓ దుండగుడు రంపంతో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.. మరో బాలిక అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఇద్దర్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాప్తాడులో పదోతరగతి విద్యార్థినిపై దుండగుడి దాడి.. కన్నీళ్లు ఆగడం లేదంటూ మంత్రి లోకేష్ ఎమోషనల్
RELATED ARTICLES


