న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌కు పర్యటనలో తొలి ఓటమి ఎదురైంది. గ్లెన్ ఫిలిప్స్ (107) శతకంతో చెలరేగడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 259/7 భారీ స్కోరు సాధించింది. అనంతరం 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, జాకబ్ డఫీ (4/23) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. దీంతో కివీస్ 87 పరుగుల తేడాతో గెలుపొందగా, సిరీస్ ప్రస్తుతం 3-1తో భారత్ ఆధిక్యంలో ఉంది.


