ఏ సీజన్ అయినా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సాయంత్రం కాగానే ఎక్కడ్నుంచి వస్తాయో తెలియదు కానీ.. గందరగోళం సృష్టిస్తాయి. దోమల కాటు మంచిది కాదు. దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే దోమల్ని కంట్రోల్ చేయాలి. చాలా మంది దోమల నివారణకు రకరకాల లిక్విడ్స్, కాయిల్స్ లేదా స్ప్రేల్ని ఉపయోగిస్తుంటారు. మరికొందరు రకరకాల ఇంటి చిట్కాల్ని ట్రై చేస్తారు.
అయితే, దోమలు గుడ్లు పెట్టే చిన్న చిన్న నిల్వ నీటి ప్రదేశాల్ని గుర్తించి తొలగిస్తే వాటి బెడద పూర్తిగా తొలిగిపోతుంది. స్పూన్ పరిమాణంలో నీరు నిల్వ ఉన్నా సరే అక్కడ కొన్ని వందల దోమలు పుడతాయి. ఇంట్లో మనం దృష్టి పడని అలాంటి ఏడు ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


