ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అర్నబ్ తుపాను భారీ నష్టాన్ని మిగిల్చింది. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. ఇక.. కోనసీమలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు బీచ్ రోడ్డు దెబ్బతినగా.. సుమారు 30 ఇళ్లు కూలిపోయాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత సహాయక చర్యలను సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగలు, వరదనీరు, సముద్రపు అలల నుంచి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అర్నబ్ తుపాను విధ్వంసంతో ఏడుగురు మృతి.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
RELATED ARTICLES


