PhonePe Firecracker Insurance: దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ఇప్పటికే మొదలై పోయాయి. ఈ పండుగకు దీపాలు వెలిగించడం, బాణ సంచా కాల్చడం అనేది సర్వసాధారణం. అయితే, కొన్నిసార్లు అనుకోని సంఘటన జరిగి బాణసంచా వల్ల గాయపడుతుంటారు. అలా గాయపడినప్పుడు వైద్య ఖర్చుల కోసం రూ.25000 పొందవచ్చు. అందు కోసం ఫోన్ పేలో కేవలం రూ.11 కడితే సరిపోతుంది. దీపావళి ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


