Central Government Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త ప్రకటించింది. దీపావళి గిఫ్ట్ అందించింది. కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం చొప్పున డీఏ, డీఆర్ పెంచడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో 60 శాతం నుంచి ఇది 63 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాల్ని చూద్దాం.


