చెట్లు పెంచడం కొంతమందికి అభిరుచి. కానీ, దీని వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అదో రకమైన పాజిటీవ్ ఎనర్జీని ఇవ్వడంతో ఇంట్లోని గాలిని శుద్ధి చేసి విష వాయువులని పీల్చుకుని ఆక్సిజన్‌ని అందించడంలో చెట్లు కీ రోల్ పోషిస్తాయి. ఇంట్లోని చెట్లని చూడగానే మనసుకి ఉల్లాసం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల మంచి నిద్ర మీ సొంతమవుతుంది. సాధారణంగా ఇంట్లో మొక్కలు విడుదల చేసే కొన్ని సహజ కెమికల్స్ బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడతాయి. అయితే, అందరికీ చెట్లు పెంచడానికి వీలు కాదు కదా ఎక్కువ ప్లేస్ ఉండదు. ఎలా పెంచాలనుకుంటారేమో. గాలిని శుద్ధి చేసే చెట్లని కుండీల్లోనే పెంచొచ్చు. అదేనండి గాలిని శుద్ధి చేసే ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకోండి.


