జింబాబ్వేతో జరిగిన మూడో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 92 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు 7 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేసి, పరాజయం పాలైంది.


