మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్ ప్లేయర్ ఆక్షన్ అక్టోబర్ 28న కేరళలోని కొచ్చి వేదికగా జరగనుంది. మొత్తం 27 ఖాళీల కోసం 146 మంది ఆటగాళ్లు బరిలో నిలవనున్నారు. ఇంగ్లండ్ స్టార్ సోఫియా డంగ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ సోఫీ మోలినెక్స్ రూ. 50 లక్షల గరిష్ట బేస్ ప్రైస్ స్లాబ్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ అత్యధికంగా రూ. 3.75 కోట్ల పర్స్‌తో వేలానికి సిద్ధమవుతోంది.


