ఇంటర్నెట్లో దాదాపు ప్రతి సౌందర్య సమస్యకు ఏదో ఒక ఇంటి చిట్కా కనిపిస్తూనే ఉంటుంది. ముఖంపై నల్లటి మచ్చలు ఉంటే నిమ్మరసం రాయమని, చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగించమని, మొటిమలు తగ్గేందుకు టూత్‌పేస్ట్ రాయమని.. ఇలా ఎన్నో చిట్కాలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మరికొందరు ఏ సమస్యకైనా వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించమని సూచిస్తుంటారు. అయితే వంటగదిలో సాధారణంగా కనిపించే రెండు పదార్థాలు ఒకదానితో ఒకటి కలిపితే, అవి చర్మానికి కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కొన్ని పదార్థాలను కలిపి ముఖానికి రాయడం వల్ల మంట, చికాకు, ఎర్రదనం, పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి స్కిన్‌కేర్ చిట్కా శాస్త్రీయంగా నిరూపితమైనదని అనుకోవడం తప్పు. మరి చర్మంపై అస్సలు ప్రయత్నించకూడని ఆ DIY స్కిన్‌కేర్ కాంబినేషన్స్ ఏవి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


