HomeLifestyleశ్వాసలో ఇబ్బంది + చిన్న నడకకే రొప్పడం + కాళ్ల వాపుల్ని తేలిగ్గా తీసుకోకండి, మీ...

శ్వాసలో ఇబ్బంది + చిన్న నడకకే రొప్పడం + కాళ్ల వాపుల్ని తేలిగ్గా తీసుకోకండి, మీ గుండె మీకు ఏం చెబుతుందో వినండి!

ఎన్నోసార్లు ఈజీగా ఎక్కిన మెట్లను ఎక్కుతున్నప్పుడు, మధ్యలోనే ఆగి ఆయాసపడుతూ శ్వాస తీసుకోవాల్సి వస్తోందా? లేదా రోజూ చేసే మార్నింగ్ వాకింగ్ హఠాత్తుగా మునుపటి కంటే ఎక్కువ అలసటను కలిగిస్తోందా? చాలామంది దీనిని అలసట, వయసు పెరగడం లేదా ఫిట్‌నెస్ లోపంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ మీ శ్వాస తీసుకునే విధానంలో వచ్చే మార్పు మీ గుండె పనితీరుపై శ్రద్ధ పెట్టాలని ఇచ్చే హెచ్చరిక కావచ్చు.
వైద్య పరిభాషలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ‘డిస్ప్నియా’ (Dyspnea) అంటారు.

ఇది ఊపిరితిత్తుల సమస్యలు, రక్తహీనత, ఇన్‌ఫెక్షన్లు, మానసిక ఆందోళన లేదా ఫిట్‌నెస్ తగ్గడం వల్ల రావచ్చు. అయితే కార్డియాక్ కోణంలో చూస్తే.. గుండె రక్తనాళాల సమస్యలు, గుండె కవాటాల లోపాలు, గుండె బలహీనపడటం వంటి సమస్యలకు శ్వాసలో ఇబ్బంది ప్రధాన హెచ్చరికగా ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ శరీరంలో వస్తున్న మార్పుల్ని గమనించడం ముఖ్యం. దీని గురించి మరింత సమాచారాన్ని డాక్టర్ రామకృష్ణ జానపాటి (సీనియర్ కన్సల్టెంట్ – కార్డియాలజీ, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, నల్లగండ్ల, హైదరాబాద్) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments