కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. అలాగే ఆయన SIR ప్రక్రియపై ధ్వజమెత్తారు. వెంటనే ఈ కార్యక్రమాన్ని ఆపాలని, గత రెండేళ్లలో జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్, హర్యాణా, బీహార్, మహారాష్ట్రలో ఓట్ల చోరీ ద్వారా ప్రభుత్వాలాను ఏర్పాటు చేశారని, ఈ దొంగలను జైలుకు పంపిస్తామని కూడా మల్లీకార్జున ఖర్గే అన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం అంతమయ్యే వరకు దేశంలో శాంతి ఉండదని కూడా ఖర్గే అన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం రోడ్ల మీదకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.


