పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఏడు నెలలు పూర్తి చేసుకుంది. ఇరు దేశాలూ పరస్పరం బాంబులు, యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నాయి. ఈ విషయంలో ఇరాన్ ఒక అడుగు ముందుకేసింది. భారతీయ సినిమాలతో ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సీన్లతో అమెరికాకు వార్నింగ్‌లు ఇస్తోంది. తాజాగా, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఎపిక్ బాహుబలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


