సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రముఖ వెల్నెస్ ట్రెండ్ ఉదయాన్నే మలాసనంలో కూర్చుని గోరువెచ్చని నీటిని సిప్ చేస్తూ తాగడం. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు. ప్రాచీన ఆయుర్వేదం, యోగా శాస్త్రం, ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రం (Human Anatomy) బలపరిచిన ఒక సహజ నివారణ మార్గం. సంస్కృతంలో ‘మాల’ అంటే దండ లేదా హారం, ‘ఆసనం’ అంటే కూర్చునే భంగిమ.
కుర్చీలు కనిపెట్టకముందు మానవులు సహజంగా కూర్చున్న విధంగా పూర్తిగా కిందకి కూర్చునే లో-స్క్వాట్ భంగిమనే మలాసనం అంటారు. ఇది హిప్స్, గజ్జలు, వెన్నెముక దిగువ భాగం, చీలమండల్ని బలోపేతం చేసి సాగేలా చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం మలాసనంలో కూర్చోని గోరువెచ్చని నీటి తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయని యోగా టీచర్ మెహక్ మెహతా చెప్పారు. అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.


