ఏవైనా నొప్పులు, జ్వరం, జలుబు వంటివి రాగానే ఎక్కువ మంది చేసే పని పెయిన్ కిల్లర్స్, ట్యాబ్లెట్స్ వంటివి తీసుకొచ్చి వేసుకోవడం. కానీ, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు డాక్టర్ సజెషన్ లేకుండా తీసుకునే మందులు లివర్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటి మెడిసిన్‌తో కొద్దిగా సమస్య తగ్గినప్పటికీ ఎలాంటి సలహా లేకుండా తీసుకేనే మందులు లివర్‌పై నెగెటీవ్ ఇంపాక్ట్ చూపిస్తాయని, ముఖ్యంగా ఎక్కువ డోస్‌లో తీసుకునే ట్యాబ్లెట్స్, సజెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ రోజుల పాటు తీసుకోవడం, వేరే మందులతో కలిపి తీసుకోవడం, ఆల్కహాల్‌తో తీసుకోవడం వంటి తప్పులన్నీ కూడా లివర్‌పై ఎఫెక్ట్ పడేలా చేస్తాయని డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి(సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపెటిక్ ఎండోస్కోపిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) చెబుతున్నారు.


