తెలంగాణలో SIR పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కొడంగల్‌లో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమైన ఆయన ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీయేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లపై దృష్టి పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తోందన్నారు.


