కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తున్నాయి. విపక్ష ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన ఉద్ధృతమవుతోంది. సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఓ మహిళ గురించి ప్రస్తావించారు. ఆమె డెహ్రాడూన్లో దాక్కుందని.. వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.


