బీజేపీ సీనియర్ నేత ఎల్ మురుగన్ కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన.. సభ్వత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి, 2029 లోక్సభ ఎన్నికలకు సిద్ధం చేయడానికే తాను కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఈ లేఖను సామాజిక మాధ్యమాల్లో ఆయన పంచుకున్నారు.


