2011లో సంచలన విజయం సాధించిన ‘ది డర్టీ పిక్చర్’ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. నిర్మాత ఏక్తా కపూర్ ఓ పాడ్‌క్యాస్ట్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. 15 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలో మరో మహిళ ఎదుర్కొన్న సవాళ్లు, సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కించేందుకు సరైన కథ సిద్ధమైందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని ఆమె తెలిపారు. దివంగత నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా విద్యా బాలన్ ప్రధాన పాత్రలో ‘ది డర్టీ పిక్చర్’ రూపొందింది.
‘డర్టీ పిక్చర్ 2’ మూవీని అనౌన్స్ చేసిన ఏక్తా కపూర్.. తెరపైకి మరో నటి కన్నీటి గాథ
RELATED ARTICLES


