మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంది. రోజుకు ఒక కప్పు అయినా సరే తాగేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. ఇక, ఆఫీసులో పనిచేసే వాళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కప్పుల మీద కప్పులు తాగుతుంటారు. అయితే, మనం టీ బయట తాగేటప్పుడు అయినా ఇంట్లో అయినా సరే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది నిల్వ ఉన్న టీని వేడి చేసి మళ్లీ మళ్లీ తాగుతుంటారు. నిల్వ ఉన్న లేదా చద్ది టీ తాగిన వెంటనే అందరికీ ఫుడ్ పాయిజనింగ్ కాకపోవచ్చు. కానీ ఆ టీని ఎన్ని గంటలు బయట ఉంచారు, అందులో ఏమేం కలిపారు (పాలు, చక్కెర వంటివి), ఎలాంటి వాతావరణంలో నిల్వ చేశారు అనే విషయాలపై ఈ ప్రమాదం ఆధారపడి ఉంటుంది.
తాజాగా తయారు చేసిన టీ సురక్షితమైనది. అయితే గది ఉష్ణోగ్రత వద్ద చాలా గంటల పాటు ఉంచిన టీలో ముఖ్యంగా వేడి, తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. నిల్వ ఉన్న టీ తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయా? ఈ విషయంపై డాక్టర్ బృందా ఎం.ఎస్ (సీనియర్ కన్సల్టెంట్ – ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ సిఎమ్‌ఐ హాస్పిటల్, బెంగళూరు) పూర్తి వివరాలు అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.


